
గతంలో తాము ఇచ్చిన ఆదేశాల్లో కొన్ని ఎందుకు అమలు చేయలేదని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్ర్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సల గరిష్ట ధరలను సవరిస్తూ తాజా జీవో ఇచ్చారా? కరోనాపై సలహా కమిటీ ఎందుకు ఏర్పాటు చేయలేదు? కొత్త ఆర్టీపీసీఆర్ ల్యాబ్ లు ఇంకెప్పుడు అందుబాటులోకి వస్తాయి? అని ప్రశ్నించింది. మూడో దశ సన్నద్ధతపై వివరాలు సమగ్రంగా లేవని ఆసంతృప్తి వ్యక్తం చేసింది. అన్నీ భవిష్యత్ లోనే చేస్తారా? ఇప్పడేమీ చేయడం లేదా? అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.