
జాతీయ మానవ హక్కుల కమిషన్ నూతన చైర్మన్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా నియామకం దాదాపు ఖరారైంది. ఆయన పేరును హై-పవర్డ్ రికమండేషన్స్ కమిటీ ప్రతిపాదించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఇందుకు సంబందఇంచిన అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ఎంపిక కమిటీలో ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, లోక్ సభ స్పీకర్ ఓం జిర్లా, రాజ్యసభలలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఉన్నారు.