Venezuela Invasion : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శనివారం వెనిజులా మీద దాడి చేశాడు. ఒక దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నిస్తూ.. ఆ దేశ హక్కులను మొత్తం కాలరాస్తూ.. ఏక మొత్తంగా తన సైన్యంతో పడిపోయాడు. ఆ దేశ అధ్యక్షుడిని అరెస్ట్ చేయించాడు. అతని భార్యని కూడా అదుపులోకి తీసుకొని.. హెలికాప్టర్ ద్వారా అమెరికా తీసుకెళ్లిపోయాడు. న్యూయార్క్ కోర్టులో ప్రవేశపెట్టించాడు.
వెనిజులా అధ్యక్షుడు మదురో అరెస్టు పరిణామాన్ని చూసిన వారెవరికైనా అమెరికా సామ్రాజ్యవాదం గుర్తుకొస్తుంది. ఇప్పటికిప్పుడు వెనిజులా అధ్యక్షుడు మీద ట్రంప్ పడిపోవడం వెనక కారణాలు విశ్లేషిస్తే అనేకం కనిపిస్తాయి. అమెరికాకు ఇప్పటివరకు వెనిజులా నుంచి మాత్రమే కాకుండా, ఇంకా అనేక ప్రాంతాల నుంచి మాదకద్రవ్యాలు సరఫరా అవుతూ ఉంటాయి. మన ప్రాంతంలో మద్యం తాగడం ఎలాగైతే అలవాటో.. అమెరికా ప్రజలు మాదకద్రవ్యాలు తీసుకోవడం కూడా అలాంటి అలవాటే.. గతంలో మెక్సికో ప్రాంతం నుంచి మాదకద్రవ్యాలు అమెరికాకు ఎక్కువగా వస్తూ ఉండేవి. అయితే మెక్సికో సరిహద్దులో అమెరికా భారీ గోడను నిర్మించింది. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత .. తమ దేశంలో నివాసముంటున్న వ్యక్తులను వివిధ కారణాల చేత మెక్సికోకు బలవంతంగా తరలించాడు ట్రంప్.. మెక్సికో సరిహద్దుల్లో గోడ కట్టించగలిగే సామర్థ్యం ఉన్న అమెరికాకు.. వెనిజుల సరిహద్దులో గోడ నిర్మించడం పెద్ద కష్టమైన పనేం కాదు. కాకపోతే అమెరికా ఆసక్తులు వేరే విధంగా ఉన్నాయి.
ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత పిచ్చిపిచ్చిగా నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టాడు. ప్రపంచ దేశాలపై వాణిజ్య సుంకాలు విధించడం మొదలుపెట్టాడు. తద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థ దారుణంగా పతనమైంది. ట్రంపు నిర్ణయాల వల్ల అమెరికాలో ఉద్యమాలు మొదలయ్యాయి. అధ్యక్షుడైన కొద్ది రోజులకే ఇలా ప్రజల నుంచి తీవ్రమైన తిరస్కారాన్ని ఎదుర్కొన్న నాయకుడిగా ట్రంప్ చరిత్రకెక్కాడు.
ఇది ఇలా సాగుతుండగానే ఎఫ్ స్టీన్ ఫైల్స్ ట్రంప్ పరువును మరింత తీశాయి. ట్రంప్ ఫోటోలు అనేకం బయటికి వచ్చాయి. కొన్ని సందర్భాలలో ట్రంప్ ఫోటోలను దాచిపెట్టారనే విమర్శలు వినిపించాయి. చివరికి మళ్ళీ ఆ ఫోటోలు ప్రత్యక్షం కావడంతో ట్రంప్ గురించి మరోసారి ప్రపంచ వ్యాప్తంగా చర్చ మొదలైంది. ప్రజల్లో మొదలైన నిరసన.. ఎఫ్ స్టీన్ ఫైల్స్ లో తన ఫోటోలు బయటపడడంతో.. ట్రంప్ కు మరో ఆలోచన లేకుండా పోయింది. వెంటనే వెనిజులా మీద దాడికి ఆదేశాలు ఇచ్చాడు. పేరుకు మాదకద్రవ్యాలు అని చెబుతున్నప్పటికీ.. చాలాకాలంగా మదురో, ట్రంప్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.. దీనికి తోడు వెనిజులా ప్రాంతంలో అపారమైన చమురు నిల్వలు ఉన్నాయి. అవన్నీ కూడా మావేనని అమెరికా అంటోంది. సుమారు ఐదు లక్షల బ్యారెళ్ళ చమురు నిల్వలు ఉన్నట్టు తెలుస్తోంది.
మెక్సికోకు దగ్గరలోనే ఉన్న ప్యూర్టా రాయికో, వర్జిన్ ఐలాండ్స్ ప్రాంతంలో అమెరికాకు సైనిక స్థావరాలు ఉన్నాయి. కొంతకాలంగా ఈ స్థానాలలో విన్యాసాలు జరుగుతున్నాయి. దీంతో వెనిజులపై అమెరికా ఏ క్షణంలో అయినా దాడి చేయవచ్చు అని అందరూ అనుకున్నారు. కానీ ఈ స్థాయిలో దాడి చేస్తుందని ఊహించలేకపోయారు. వెనిజుల మీద దాడి చేయడం ద్వారా.. చమురు నిల్వలు తమవే అని చెప్పడం ద్వారా ట్రంప్ మరోసారి తన మీద వస్తున్న వ్యతిరేకతను తగ్గించుకున్నారు.. ఇప్పుడు అమెరికా సమస్యల మీద మాట్లాడే అవకాశాన్ని ట్రంప్ వివిధ మీడియా సంస్థలకు దూరం చేశారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం కేవలం వెనిజులా మీద మాత్రమే చర్చ చేస్తుంది.