NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం మన స్టార్ హీరోలందరు వాళ్ళు చేసిన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు తను చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తుండడం విశేషం… కథల పరంగా చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నప్పటికి ఆయన సినిమా మాత్రం ఎక్కువ మంది ప్రేక్షకులకు రీచ్ అవ్వడం లేదు…ఆయన మాస్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. మాస్ ప్రేక్షకులు తనకి నీరాజనం పడుతున్నప్పటికి ఇతర ప్రేక్షకులు సైతం అతని సినిమాలను ఎక్కువగా పట్టించుకోవడం లేదనే వార్తలైతే వస్తున్నాయి.
సక్సెస్ ఫుల్ టాక్ వచ్చిన తర్వాత మాత్రమే ప్రేక్షకులు థియేటర్లో అతని సినిమాలను చూస్తున్నారు. ప్రేక్షకులు సినిమాని చూస్తున్నప్పటికి కొంతమంది ఎందుకో అతని సినిమా నుంచి డిస్కనెక్ట్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ సినిమాలతో పోల్చుకుంటే ఎన్టీఆర్ సినిమాలకు వచ్చేసరికి ప్రేక్షకుల ఆదరణ కొంతవరకు తగ్గిపోతోంది.
అందువల్లే అతని సినిమాల్లో ఏది కూడా ఇండస్ట్రీ హిట్స్ సాధించకపోవడం అభిమానులను కలవరపెడుతోంది… ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన రాని గుర్తింపు కొంత మంది యంగ్ హీరోలకు వస్తోంది. మరి జూనియర్ ఎన్టీఆర్ సైతం టైర్ వన్ హీరోగా కొనసాగుతున్న కూడా ఎందుకనో ఆయన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలువలేకపోతున్నాయి.
వరుసగా ఆరు హిట్లు సాధించినప్పటికి అవన్నీ కూడా ఒక మోస్తారు హిట్లు గానే మిగిలాయి తప్ప అందులో ఏది కూడా ఇండస్ట్రీ హిట్ కానీ బ్లాక్ బస్టర్ హిట్ గా కానీ మారలేకపోయాయి. ఇక రీసెంట్గా వచ్చిన వార్ 2 సినిమాతో మరో ప్లాప్ ను మూట గట్టుకున్నాడు. ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చేస్తున్న సినిమాతో మరోసారి సూపర్ సక్సెస్ ని సాధిస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…