
కరోనా డెల్టా రకం కేసులు పెరిగిపోతుండటంపై డబ్ల్యూహెచ్ వో చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఆందోళన వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తు మనమిప్పుడు థర్డ్ వేవ్ ప్రారంభంలో ఉన్నామంటూ హెచ్చరించారు. డెల్టా రకం వ్యాప్తికి తోడు సామాజిక కార్యకలాపాలు పెరగడం, ప్రజారోగ్య చర్యల్ని సరిగా పాటించకపోవడం, ప్రభుత్వాలు ఆంక్షలను సడలించడం వల్ల కేసులు, మరణాలు పెరుగుతున్నట్లు వ్యాఖ్యనించారు.