Lokesh Kanagaraj : సినిమా ఇండస్ట్రీలో సక్సెసులు అంత ఈజీగా రావు. ఒక్కో మెట్టు పైకెక్కుతూ వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ ప్రేక్షకుడిని మెప్పిస్తూ సక్సెస్ లను సాధించిన వాళ్లకు మాత్రమే ఇక్కడ హీరోగా నిలబడే అవకాశం ఉంటుంది. వారసత్వం ఉన్నంత మాత్రాన స్టార్ హీరోలు అయిపోవచ్చు అనేది సరైనది కాదు…తెలుగులో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి అల్లు అర్జున్ కి చాలా మంచి క్రేజ్ ఉంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో పెను సంచలనాన్ని క్రియేట్ చేసుకున్న నటుడు అల్లు అర్జున్…పుష్ప సినిమా పాన్ ఇండియా ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇక ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు పలు రికార్డులను క్రియేట్ చేస్తుంటే, అల్లు అర్జున్ మాత్రం పుష్ప 2 సినిమాతో బాహుబలి 2 రికార్డు ను సైతం బ్రేక్ చేశాడు. ఇక ఇటువంటి క్రమంలోనే ఇప్పుడు రాబోతున్న సినిమాల విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటివరకు ఆయన ఎలాంటి సినిమాలు చేసిన కూడా ఆయనకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది. ఇక ఇప్పుడు అట్లీ డైరెక్షన్లో చేస్తున్న ‘రాకా’ సినిమాతో మరోసారి పెను సంచలనాన్ని క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమాల విషయంలోనే ఆయన చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ చాలా రిస్క్ కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. లోకేష్ కనకరాజ్ తన సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ కి పెద్ద పీట వేస్తుంటాడు. కాబట్టి ఈ సినిమాలో చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ తను పర్ఫెక్ట్ గా లైవ్ యాక్షన్ సీక్వెన్స్ లు చేయగలిగితే మాత్రం ఈ సినిమాలో ఆయన అనుకున్నది పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన వాడవుతాడు.
లేకపోతే మాత్రం ఆయన చాలావరకు ఇబ్బందులను ఎదుర్కునే పరిస్థితి రావచ్చు. ఒకవేళ లైవ్ యాక్షన్ చేసినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగిన కూడా అతనికి చాలా వరకు ఇబ్బందులైతే ఎదురవ్వచ్చు. ఇవన్నీ క్యాలిక్లెట్ చేసుకొని తను లైవ్ స్టంట్స్ చేస్తే బాగుంటుందని మరి కొంతమంది చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన టాప్ హీరోగా మారిపోయాడు.
కాబట్టి అతనికి ఏ ఇబ్బంది జరిగినా కూడా దానివల్ల సినిమా షూటింగ్ కొద్ది రోజులు నిలిపివేయాల్సిన అవసరమైతే ఉంటుంది. కాబట్టి ఆయన వాటన్నింటినీ మనసులో పెట్టుకొని తను జాగ్రత్తలు తీసుకుంటూ స్టంట్స్ చేస్తే బాగుంటుందని సినిమా మేధావులు సైతం తనకి సలహాలను ఇస్తుండటం విశేషం…
గత కొద్దిరోజుల నుంచి హీరోలందరు యాక్షన్ ఎపిసోడ్స్ కి డూప్ లనే ఎక్కువగా వాడుతున్నారు అంటూ చాలామంది విమర్శిస్తున్నారు. దాంతో వాళ్ళకి సమాధానం చెప్పడానికి అల్లు అర్జున్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత దీని మీద ఎవరో ఒకరు స్పందిస్తే తప్ప దాని మీద సరైన క్లారిటి రాదు…
