Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురిపిస్తూ ముందుకు దూసుకువెళ్తోంది. సినీ ఇండస్ట్రీ లోకి వచ్చి పదేళ్లు దాటినప్పటికీ కూడా సరైన కమర్షియల్ సక్సెస్ లేదు , ఇక అఖిల్ పని అయిపోయినట్టే అని అనుకున్న ప్రతీ ఒక్కరి నోర్లను ‘లెనిన్’ చిత్రం తో మూయించారు అఖిల్. 2 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 65 శాతం కి పైగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని రీకవరీ చేసి సెన్సేషన్ సృష్టించింది. నేటితో పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోనుంది. ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి 2 రోజుల్లో ఎంత షేర్ వసూళ్లు వచ్చిందో ఒకసారి చూద్దాం.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి మొదటి రోజున 5 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, 2వ రోజున 5 కోట్ల 48 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 10 కోట్ల 98 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 17 కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ప్రాంతాల వారీగా చూస్తే నైజాం నుండి 4 కోట్ల 21 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, సీడెడ్ నుండి 1 కోటి 44 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , ఉత్తరాంధ్ర నుండి 1 కోటి 37 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా ఈస్ట్ గోదావరి నుండి 1 కోటి 9 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, వెస్ట్ గోదావరి నుండి 70 లక్షలు , గుంటూరు నుండి 1 కోటి రూపాయిలు , కృష్ణ నుండి 71 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , నెల్లూరు నుండి 46 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
అదే విధంగా కర్ణాటక నుండి 1 కోటి రూపాయిలు, ఓవర్సీస్ నుండి 2 కోట్ల 15 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా అన్ని ప్రాంతాలకు కలిపి 14 కోట్ల 13 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 25 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. విడుదలకు ముందు ఈ చిత్రానికి 22 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా, మరో 7 కోట్ల 87 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబడితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుంది. ఈరోజు రేపటితో బ్రేక్ ఈవెన్ మార్కుని దాటొచ్చు.
