
కరోనా చికిత్సకు కీలంకంగా మారిన రెడ్ డెసివర్ ను ఇంజక్షన్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బాధితులకు ఇస్తున్న రెమ్ డెసివర్ ఇంజక్షన్ పై తమకు అనుమానాలు ఉన్నాయని తెలిపింది. రెమ్ డెసివర్ వల్ల కరోన రోగులు కోలుకున్నట్లు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. అందుకే కరోనా చికిత్స నుంచి రెమ్ డెసివర్ ను తొలగిస్తున్నట్లు ఆ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇక భారత్ లో కరోనా చికిత్సకు ఉపయోగిస్తున్న రెమ్ డెసివర్ ఇంజక్షన్ పై తమకు అనుమానాలు ఉన్నాయని భారత వైద్యనిఫుణులు హెచ్చరిస్తున్నారు.