Homeబిజినెస్weekly savings tips : వారానికి వెయ్యి మాత్రమే.. ఇది మీ జీవితాన్ని ఎలా మార్చేస్తుందంటే..

weekly savings tips : వారానికి వెయ్యి మాత్రమే.. ఇది మీ జీవితాన్ని ఎలా మార్చేస్తుందంటే..

weekly savings tips : నెలకు లక్షల్లో వస్తుంది జీతం.. నెల తిరిగేసరికి జేబులో రూపాయి ఉండడం లేదు.. కొన్ని సందర్భాల్లో స్నేహితులను అప్పు అడగాల్సి వస్తోంది.. ఖర్చులకు విపరీతంగా పెరిగిపోయాయి. వేటికి కళ్లెం వేసే పరిస్థితి లేకుండా పోయింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు.. ఈఎంఐలు కడుతున్నాను.. క్రెడిట్ కార్డు అప్పులు చెల్లిస్తున్నాను. అయినప్పటికీ ఆర్థికంగా సమస్యలు తప్పడం లేదు..

ఈ బాధ ప్రతి పదిమందిలో 8 మందికి ఉంటుందంటే అతిశయోక్తి కాదు. సంపాదన పెరిగినట్టుగానే ఖర్చులు కూడా విపరీతం కావడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ క్రమంలోనే చాలామంది అప్పులు చేస్తున్నారు. ఆర్థికంగా వెసులుబాటు సాధించడానికి రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇలాంటప్పుడే ఈ చిట్కాను పాటిస్తే ఆర్థికంగా ఇబ్బందులను సులభంగా ఎదుర్కోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా వారాంతంలో ఒక సినిమా చూసేందుకు.. రెస్టారెంట్ వెళ్లేందుకు.. తక్కువలో తక్కువ 1000 వరకు ఖర్చవుతుంది. వారాంతంలో ఏ మనిషి అయినా సరే కాస్త ఆట విడుపు కోరుకోవడం సహజం. అయితే అటువంటి వాటిని సాధ్యమైనంతవరకు ఖర్చు లేకుండా ఆస్వాదించే మార్గం చూసుకోవాలి.. ఆ వెయ్యి రూపాయలను అలా దాచి పెడుతూ ఉండాలి. వారానికి వెయ్యి రూపాయల చొప్పున దాచుకుంటే.. నెలకు ఏకంగా నాలుగువేల దాకా మిగులుతాయి. సంవత్సరానికి అది 48 వేల దాకా అవుతుంది. వాటిని అత్యవసరమైన నిధిగా వాడుకోవచ్చు. నెలకు కొంత ఎస్ఐపి లేదా ఆర్డీలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ గనుక చేస్తే దీర్ఘకాలంలో లాభాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి.

ఆర్థికంగా కష్టాలు అందరికీ ఉంటాయి. కాకపోతే వాటిని సానుకూల ధోరణిలో పరిష్కరించుకునే మార్గాలను అన్వేషించుకోవాలి. ఈ కథనంలో చెప్పినట్టు కాకుండా.. ఇంకా వేరే విధంగా కూడా పొదుపు సాగించవచ్చు. తద్వారా ఆర్థికంగా ఒత్తిడి ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. అప్పులు చేయాల్సిన అగత్యం అంతకంటే ఉండదు. ఎందుకంటే అప్పు ఎప్పటికైనా ముప్పే. సాధ్యమైనంత వరకు అప్పు లేకుండా.. చూసుకోవాలి. అనవసరమైన ఖర్చులను పూర్తిగా తగ్గించుకోవాలి. ఆడంబరాలకు దూరంగా ఉండాలి. బడ్జెట్ పరిధిలోనే పూర్తయ్యేలా చూసుకోవాలి. అలాగని గిరిగీసి బతకాలని చెప్పడం లేదు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version