Homeలైఫ్ స్టైల్red lightning in sky : ఆకాశంలో ఎర్రటి మెరుపులు.. అచ్చం యుగాంతం సినిమా లాగే...

red lightning in sky : ఆకాశంలో ఎర్రటి మెరుపులు.. అచ్చం యుగాంతం సినిమా లాగే ఉందిగా..

red lightning in sky : ఉన్నట్టుండి ఆకాశం ఒక్కసారిగా మారిపోతూ ఉంటుంది. భయంకరమైన మేఘాలు ఆవరిస్తాయి. ఉరుములు గర్జన చేస్తూ ఉంటాయి. రకరకాల రంగులలో కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత వర్షం మొదలవుతుంది.. ఏకధాటిగా కురుస్తూనే ఉంటుంది. సముద్రాలు పోటెత్తుతూ ఉంటాయి. వరద నీరు ముంచెత్తుతూ ఉంటుంది. చూస్తుండగానే ఊర్లకు ఊర్లు నీళ్లలో కలిసిపోతూ ఉంటాయి. మొత్తంగా ప్రపంచమే మునిగిపోతూ ఉంటుంది.

చదువుతుంటే భయమేస్తోంది కదూ. అదేంటి యుగాంతం స్టోరీని చెబుతున్నారు అనుకుంటున్నారు కదా.. ఈ స్థాయిలో కాకపోయినా ఇలాంటి సంఘటనే ఇప్పుడు చోటుచేసుకుంది. అది కాస్త ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఆసియా ప్రాంతంలో చైనాకు దగ్గరగా ఉన్న టిబెట్ ప్రాంతంలో ఇటీవల వర్షాలు కురిసాయి. వర్షాలు కురవడం పెద్ద విషయం కాకపోయినప్పటికీ అక్కడ ఆకాశంలో చోటు చేసుకున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వర్షాలు కురుస్తున్నప్పుడు ఆకాశంలో ఎర్రటి మెరుపులు కనువిందు చేశాయి. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తోంది. వీటిని రెడ్ స్ప్రైట్స్ అని పిలుస్తుంటారు. ఇలాంటి మెరుపుల వల్ల వాతావరణం మొత్తం భయానకంగా మారిపోతూ ఉంటుంది. పైగా ఇవి భూమి ఉపరితలానికి దాదాపు 50 నుంచి 90 కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయి. ప్రదేశాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితిని ట్రాన్సియంట్ లూమినస్ అని పిలుస్తుంటారు. విద్యుత్, నైట్రోజన్ అణువులు వెంటనే రియాక్ట్ అయి ఇలాంటి ఎరుపు రంగు లో మెరుపులు రావడానికి కారణం అవుతూ ఉంటాయి.

సాధారణంగా వర్షాలు కురుస్తున్నప్పుడు మెరుపులు ఏర్పడటం సర్వసాధారణం. పైగా అవి తెలుపు రంగులో ఉంటాయి. మెరుపులు కూడా క్షణకాలంలోనే ఏర్పడి మాయమవుతుంటాయి. కొన్ని సందర్భాలలో మేఘాలు పరస్పరం రాపిడి చేసుకున్నప్పుడు మెరుపుల తీవ్రత అధికంగా ఉంటుంది. ఆ సమయంలో ఉరుములు కూడా అధికంగా ఉంటాయి. మెరుపులు ఎరుపు రంగులో ఉండడం వెనుక ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నప్పటికీ.. కొండ ప్రాంతమైన టిబెట్ లో ఇవి ఏర్పడటం ఆందోళన కలిగిస్తోంది.

ఇప్పటికే ప్రపంచంలో అనేక రకాలుగా వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రం ఉపరితలం విపరీతంగా వేడెక్కుతోంది. దీనివల్ల మన దేశానికి వచ్చే నైరుతి రుతుపవనాల గమనం లో అనేక రకాల మార్పులు చోటు చేసుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిని సూపర్ ఎల్ నీనో అని పిలుస్తున్నారు. దీనివల్ల వర్షాలు సరిగా కురువకపోవడం.. కరువు కాటకాలు ఏర్పడే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మనదేశంలో ఇలా ఉంటే.. ఇక ప్రపంచంలో మిగతా దేశాలలో ఆకస్మిక వర్షాలు.. వంటివి చోటు చేసుకుంటున్నాయి. యుగాంతం మాదిరి పరిస్థితి కాకపోయినప్పటికీ.. జాగ్రత్తగా ఉండాలని ప్రకృతి చెబుతోంది. అందువల్లే ఈ హెచ్చరికలు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version