Rahul Gandhi Prime Minister : రాహుల్ గాంధీ ఒక పెద్ద జోస్యం చెప్పారు. కళ వచ్చిందో ఏంటో తెలియదు.. సంవత్సరం లోపల రాజకీయ సునామీ వస్తుంది.. మోడీ ప్రధాని పదవి ఊడబోతుంది.. అంతరంగిక తిరుగుబాటు వస్తుంది.. ఆర్థిక సంక్షోభం రావచ్చు.. ఎమర్జెన్సీ రావచ్చు అని హెచ్చరికలు చేశారు. సీబీఐ, ఈసీలు ఇదే అంచనా వేస్తున్నాయని రాహుల్ భయపెట్టే మాటలు మాట్లాడారు. ఇలా గాలికబర్లు చెప్పుకొచ్చారు.
రాహుల్ గాంధీ కోరిక ఇది అయ్యిండొచ్చు. రాహుల్ మాటల్లో ఏమైనా అర్థముందా? కాంగ్రెస్ కు విధేయంగా ఉండే రామచంద్ర గుహ రచయిత మాట్లాడుతూ.. ‘ఎప్పటికీ మోడీని రాహుల్ గాంధీ ఓడించలేడు. 2008లో పార్లమెంటరీ అధ్యక్షుడు అయిన రాహుల్ గాంధీ.. 1200 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాడు ఉండేవారు.. ఇప్పుడు 600 మందికి పడిపోయారని రామచంద్ర చెప్పుకొచ్చారు. 20 ఏళ్లలో రాహుల్ మారలేదని.. బాధ్యతలు లేకుండా పరిపక్వత చెందకుండా ఉన్నాడని.. మోడీకి పోటీదారుడు ఎప్పటికీ రాహుల్ కాలేడని రామచంద్ర తెలిపారు.
ఎందుకు రాహుల్ జీవితంలో ప్రధాని కాలేడు? అని ప్రశ్నించుకుంటే.. ప్రధాని కావాలంటే పార్టీ ఎదగాలి.. పార్టీ ఎదగాలంటే ఐదు పెద్ద రాష్ట్రాలు ఆ పార్టీకి అండగా నిలబడాలి. కనీసం నాలుగు మూడు రాష్ట్రాల్లో అయినా కాంగ్రెస్ నిలబడాలి. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, బీహార్, తమిళనాడులలో కాంగ్రెస్ గెలవాలి. కానీ దారుణంగా ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పడిపోయింది.
రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధానమంత్రి కాలేడు ఎందుకని? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

