
జనసేన ప్రధాన లక్ష్యం సగటు ప్రజల కన్నీళ్లు తుడవటమే అని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా పవన్ కొవిడ్ బారిన పడి మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. విపత్తులో చనిపోయిన ప్రతి ఒక్కరికి జనసేన తరఫున నివాళులు. ప్రజాస్వామ్య విలువలు నిలబెట్టాడానికి జనసేన కృషి చేసోందని అన్నారు.