
భారత్ లో నిర్లక్ష్యానికి, అణచివేతకు, వివక్షకు గురైన జాతి దళితజాతి. అలాంటి దళితుల్లో ఐకమత్యం రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. వాసాలమర్రిలోని 76 దళిత కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నాం. రేపట్నుంటే దళితుల చేతుల్లో రూ. 10 లక్షల చొప్పున డబ్బులు ఉంటాయని సీఎం స్పష్టం చేశారు. వాసాలమర్రి గ్రామానికి దళిత బంధు కోసం రూ. 7.60 కోట్లు తక్షణమే మంజూరు చేస్తున్నానని సీఎం ప్రకటించారు.