
మెగా స్టార్ చిరంజీవి కొన్ని ఏళ్లుగా టాలీవుడ్ లో నంబర్ 1 హీరోగా ఉన్నాడు. ఆయన ఎందుకు అలా నంబర్ 1 హీరో అయ్యాడు? ఆయన తన సినిమాల విషయంలో ఏం చేస్తాడన్నది అందరిలోనూ ఆసక్తి కలిగించే విషయం.. అయితే తాజాగా అది రివీల్ అయ్యింది.
చిరంజీవి తన సినిమాల విషయంలో ఎప్పుడూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారట.. కథ, కథనం, అందులో నటించే నటీనటుల విషయంలో ఏమాత్రం రాజీపడకుండా ముందుకు వెళతాడట.. కథ దగ్గర నుంచి పాటలు, కాస్టింగ్, టైటిల్ ఇలా అన్ని విషయాల్లోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు.. రకరకాల వ్యక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ అందుతుంటుంది. అవన్నీ చిరంజీవి పరిగణిస్తారు కూడా.. అందుకే దశాబ్ధాలుగా ఆయనే నంబర్ 1గా ఉండడానికి కారణం ఆయన అందరి అభిప్రాయాలు తీసుకోవడమేనట..
‘ఆచార్య’ టైటిల్ విషయంలోనూ చిరంజీవికి అలాంటి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఈ టైటిల్ అనుకున్న తర్వాత తన కుటుంబంలో వాళ్లందరి గురించి ఈ టైటిల్ గురించి చర్చించారట.. ఇంట్లో వాళ్లందరూ ఏకగ్రీవంగా ఈ టైటిల్ కే ఓటు వేశారట.. అందుకే చిరంజీవి కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు.
తన సినిమా టైటిళ్లు , కథలు, పాత్రల విషయంలో అందరి సలహాలు తీసుకుంటానని చిరంజీవి తెలిపాడు. ముఖ్యంగా సినిమా టైటిల్ విషయంలో మా అమ్మ ఇచ్చే సలహాలు పాటిస్తానని.. ఆమె చెప్పినవి చాలా మటుకు జరిగాయని వివరించారు.