దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రజల కొరకు ఎన్నో పాలసీలను అందుబాటులోకి తెచ్చింది. ఎల్‌ఐసీ నుంచి మహిళల స్వావలంబన కోసం ఆధార్ శిలా పేరుతో కొత్త స్కీమ్ అందుబాటులోకి వచ్చింది. ఈ స్కీమ్ ద్వారా తక్కువ ఇన్వెస్ట్ మెంట్ తో ఎక్కువ లాభం పొందే అవకాశం అయితే ఉంటుంది. 8 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలు ఈ స్కీమ్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎవరైతే ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్లు తక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఎక్కువ లాభాలను పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు పెట్టుబడిపై రాబడి హామీతో పాటు ఎల్ఐసీ రక్షణ కవరేజీ కూడా లభించే అవకాశాలు అయితే ఉంటాయి. సంవత్సరానికి 10,585 రూపాయల చొప్పున ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మొత్తం 20 సంవత్సరాల పాటు 2,14,696 రూపాయలు చెల్లించాలి.
ఈ స్కీమ్ ద్వారా మెచ్యూరిటీ తర్వాత ఏకంగా 4 లక్షల రూపాయలు లభించే అవకాశం ఉంటుంది. సగానికి సగం లాభం పొందే అవకాశం ఉండటం వల్ల మహిళలకు ఈ పాలసీ బెస్ట్ అని చెప్పవచ్చు. సమీపంలోని బ్రాంచ్‌ను సందర్శించడం లేదా ఎల్‌ఐసీ ఏజెంట్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
నెలవారీ, త్రైమాసిక లేదా అర్ధ-వార్షిక ప్రాతిపదికన ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మహిళలకు ఈ స్కీమ్ తో పాటు మరికొన్ని స్కీమ్స్ ను ఎల్‌ఐసీ అందిస్తుండగా మంచి స్కీమ్ లను ఎంపిక చేసుకోవడం ద్వారా ఎక్కువ బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఉంటుంది.