ఆంధ్రప్రదేశ్ లో పరీక్షలు నిర్వహిస్తాం: మంత్రి సురేష్

ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. కొవిడ్ తగ్గాక పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పరీక్షలను రద్దు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరడం లేదని ఆయన తెలిపారు. ప్రతిపక్షాలు దీనిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. రాజమహేంద్రవరంలో ఎంసీ భరత్ తో కలిసి పర్యావరణ దినోత్సవం సందర్భంగా సురేష్ మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ ముందుకు రావాలన్నారు.

Written By: Suresh, Updated On : June 5, 2021 11:56 am
Follow us on