https://oktelugu.com/

కేసీఆర్, కేటీఆర్ రూటేంటి? హీరోయిజం చూపుతున్న నేతలు

కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతోంది. ప్రస్తుతం సెకండ్ వేవ్ ప్రభావంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో ప్రళయం సృష్టించే వైరస్ కు అందరు భయపడుతున్నారు. మూడో వేవ్ ప్రభావం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో కరోనా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా బారిన పడిన వారి దగ్గరకు ఎవరు రాకపోవడంతో నరకం అనుభవిస్తున్నారు. వైరస్ తీవ్రత అలాంటిది మరి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆస్పత్రులకు వెళ్లేందుకు ఎవరూ సాహసం […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 5, 2021 / 12:03 PM IST
    Follow us on

    కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతోంది. ప్రస్తుతం సెకండ్ వేవ్ ప్రభావంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో ప్రళయం సృష్టించే వైరస్ కు అందరు భయపడుతున్నారు. మూడో వేవ్ ప్రభావం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో కరోనా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా బారిన పడిన వారి దగ్గరకు ఎవరు రాకపోవడంతో నరకం అనుభవిస్తున్నారు. వైరస్ తీవ్రత అలాంటిది మరి.

    కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆస్పత్రులకు వెళ్లేందుకు ఎవరూ సాహసం చేయడం లేదు. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం కేసీఆర్ చేశారు. ఫలితంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఒకటి కాదు రెండు సార్లు కొవిడ్ రోగులను పరామర్శించేందుకు ఆస్పత్రులకు వెళ్లి తనలోని మానవత్వాన్ని చాటారు. సికింద్రాబాద్ గాంధీ, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రులను సందర్శించి రోగులను పరామర్శించి ఓదార్చారు.

    గాంధీ ఆస్పత్రిలో మాత్రమే కాదు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోనూ వ్యవహరించిన కేసీఆర్ తీరు హాట్ టాపిక్ గా మారింది. అప్పటివరకు కొవిడ్ ఎపిసోడ్ లో కేసీఆర్ తీరును విమర్శించిన వారు వేలెత్తి చూపించిన వారంతా మౌనంగా ఉండాల్సిన పరిస్థితి. కొవిడ్ వార్డుల్ని సందర్శించే సమయంలో పీపీఈ కిట్, చేతికి గ్లౌస్ లాంటివి ఏమీ లేకుండా కేవలం డబుల్ మాస్కుకు పరిమితమైన వైనం అందరినీ ఆశ్చర్యపరిచింది.

    సీఎం తనయుడు కేటీఆర్ సైతం ఇదే కోవలో వ్యవహరించారు. తండ్రి మాదిరే డబుల్ మాస్కు వేసుకుని కొవిడ్ వార్డుల్లో తిరుగుతూ రోగులను పరామర్శించారు. టిమ్స్ లో ఆయన పర్యటన తీరు చూసిన వారందరు ఆశ్చర్యానికి గురయ్యారు. పేషెంట్లకు సమీపంలోకి వెళ్లి వారిని పలకరించారు. వారిలో ధైర్యం చెప్పి ఓదార్చారు. దీంతో తండ్రి కొడుకుల ధైర్యం చూసి అందరు ముక్కున వేలేసుకున్నారు. ఇన్నాళ్లు విమర్శించిన వారు ఇప్పుడు నోరు మెదపడం లేదు.