
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాకముందు తెలంగాణ వారికి ఏదీ చేతకాదని కొంత మంది దుర్మార్గంగా వాదించారు. కానీ చిత్తశుద్ధి, వాక్ శుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమవుతుందని ఇవాళ నిరూపించామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రూ. 64.70 కోట్లతో 93.33 ఎకరాల విస్తిర్ణంలో నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. జిల్లాల్లో కలెక్టరేట్ ఏర్పాటవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.