
హీరోయిన్ ప్రగ్యా సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ హకీం అలీమ్ సెలూక్ కు వెళ్లారు. అక్కడి నుంచి బయటకు వచ్చిన ప్రగ్యాని చూసిన కొంతమంది యాచకులు వెంటనే ఆమెను చుట్టుముట్టారు. ఆకలిగా ఉందని కొంత డబ్బు దానం చేయమని కోరారు. షాక్ కు గురైన ప్రగ్యా అక్కడి నుంచి బయటపడేందుకు ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకపోయింది. తనని మొదట కారు ఎక్కిస్తే డబ్బు ఇస్తానని మాట ఇవ్వగానే యాచకులు పక్కకు తప్పుకున్నారు. వెంటనే కారు ఎక్కిన ప్రగ్యా తన బ్యాగ్ లో నుంచి కొంత డబ్బు తీసి వాళ్ల చేతికందించారు. అయినా సరే వాళ్లు ఇంకొంత ఇవ్వమని కోరడంతో ఆమె ఏం మాట్లాడకుండా బయలుదేరబోయారు. కానీ యాచకులు మాత్రం ఆమె కారును పట్టుకుని దాని వెంటే పరిగెత్తారు. చివరికి చేసేదేమీ లేక ఆమె ఇంకొంత డబ్బు వాళ్లకి ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.