
తెరాస కుట్రలను ఎదుర్కొని హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలవబోతున్నామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఉప ఎన్నికకు సంబంధించి హైదరాబాద్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈటల రాజేందర్ గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హుజూరాబాద్ ఇన్ చార్జి, మండల ఇన్ ఛార్జిలకు ఆయన దిశానిర్దేశం చేశారు.