
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రెండో రోజు సీబీఐ విచారణ కొసాగుతోంది. వివేకా ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేసిన ఇదయతుల్లాను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కడప కేంద్ర కారాగారంలో ని అతిథి గృహంలో ఈ విచారణ జరుగుతోంది. ఇదయతుల్లాతో పాటు వివేకా కారు మాజీ డ్రైవర్ దస్తగిరిని కూడా రెండో రోజూ అధికారులు ప్రశ్నిస్తున్నారు. దస్తగిరి సోమవారం ఏడు గంటల పాటు విచారించిన విషయం తెలిసిందే. ఆయన్ను నెల రోజులుగా సీబీఐ అధికారులు దిల్లీలో విచారించి ఇటీవలే కడపకు పంపించారు.