
గోపాలపట్నం ఎల్లపు వాని పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం రేగింది. ఆరుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ నెల 23వ తారీఖున పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో ఆరుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఎల్లపు వాని పాలెం గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులకు, కొత్తపాలెం చెందిన ఒక విద్యార్థికి, సంతోష్ నగర్ ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు విద్యార్థులకు కరోనా బారిన పడ్డారని ప్రధానోపాధ్యాయులు కవిత తెలియజేశారు. విషయం తెలుసుకున్న జీవీఎంసీ అధికారులు పాఠశాల ప్రాంగణంలో, విద్యార్థుల గృహాల వద్ద శానిటేషన్ చేయించారు.