
విశాఖలోని పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో దారుణం చోటు చేసుకుంది. అడ్మిరన్ లైఫ్ సైన్స్ ఫార్మ కంనెనీలో బాయిలర్ నుంచి వ్యర్థ రసాయన విషవాయువులు వెలువడుతున్నాయి. దీంతో పరిశ్రమ నుంచి కార్మికులు బయటకు పరుగులు తీశారు. విష వాయువులు పీల్చి శ్వాస అందక సమీపంలోని గ్రామాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బాయిలర్ ను మెయింటినెన్స్ చేయకపోవడమే ఈ ఘటనకు ప్రధాన కారణంగా స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.