
షూటింగులతో సందడిగా ఉండే టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మా ఎన్నికల కారణంగా వాతావరణం వేడెక్కింది. మా లో ఇకపై తెలంగాణ, ఆంధ్రా అని రెండు విభాగాలు ఉండాలంటూ నటుడు సీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. సీవీఎల్ చేసిన వ్యాఖ్యలకు ప్రముఖ నటి విజయశాంతి మద్దతు తెలిపారు. ఆయన వాదనలో నిజముందని ఆమె అన్నారు. మా ఎన్నికలపై సీవీఎల్ నరసింహారావు ఆవేదన న్యాయమైంది అని అన్నారు.