https://oktelugu.com/

టీడీపీ ఫైర్ బ్రాండ్లు ఎందుకు మౌనం దాల్చారు?

మాటలతో కోటలు కడతారంటారు. మాట తూటా కంటే బలమైంది. సరైన మాటలు మాట్లాడితే ఎంత వివాదమైనా త్వరగా సమసిపోతుంది. రాజకీయాల్లో అయితే మాటాలకు అంత పవర్ ఉంటుంది. ఎంత పొదుపుగా వాడితే అంత మంచిది. మాట తూలితే తీసుకోలేం. రాజకీయ నాయకులకు మాటలు మీదే ఉంటాయి. ఎలాంటి వాటినైనా తన పదజాలంతో కొట్టిపారేస్తుంటారు. ప్రస్తుతం తెలుగుదేశంలో మాటకారులు తక్కువ అయిపోయారు. పాపం వారి కోసమే అధినేత చంద్రబాబు వెతుకుతున్నారు. టీడీపీలో బుద్దా వెంకన్న, బీటెక్ రవి, పోతుల […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : June 28, 2021 / 12:19 PM IST
    Follow us on

    మాటలతో కోటలు కడతారంటారు. మాట తూటా కంటే బలమైంది. సరైన మాటలు మాట్లాడితే ఎంత వివాదమైనా త్వరగా సమసిపోతుంది. రాజకీయాల్లో అయితే మాటాలకు అంత పవర్ ఉంటుంది. ఎంత పొదుపుగా వాడితే అంత మంచిది. మాట తూలితే తీసుకోలేం. రాజకీయ నాయకులకు మాటలు మీదే ఉంటాయి. ఎలాంటి వాటినైనా తన పదజాలంతో కొట్టిపారేస్తుంటారు. ప్రస్తుతం తెలుగుదేశంలో మాటకారులు తక్కువ అయిపోయారు. పాపం వారి కోసమే అధినేత చంద్రబాబు వెతుకుతున్నారు.

    టీడీపీలో బుద్దా వెంకన్న, బీటెక్ రవి, పోతుల సునీత (పార్టీ మారారు) వైవీబీ రాజేంద్రప్రసాద్ సహా అనేక మంది నేతలు ఉన్నా ఇప్పుడు అంతస్థాయిలో మాట్లాడేవారు కరువయ్యారు. దీంతో బాబు వారి కోసం వేటలో పడ్డారు. ఫైర్ బ్రాండ్ల సేవలు పార్టీకి అవసరమని గుర్తిస్తున్నారు. చంద్రబాబుకు రెండేళ్ల పాటు కలిసి వచ్చింది. మండలిలో అడుగుపెట్టిన ఫైర్ బ్రాండ్లు వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలపై విమర్శలు చేస్తూ ఇరుకునపెట్టారు.

    దీంతో రెండేళ్లు సాఫీగా సాగిన సంసారంలో ప్రస్తుతం నేతలు కరువయ్యారు. మండలిలో అడుగుపెట్టిన వారు పదవీకాలం పూర్తి కావడంతో వారు రిటైరైపోయారు. దీంతో టీడీపీకి నాయకుల కరువు ఏర్పడింది. ఎమ్మెల్యేల్లో 23 మంది ఉండగా అందులో నలుగురు పార్టీ మారారు. ఇక ఉన్న 19 మందిలో ఎక్కువ మంది మాట్లాడేవారు లేరు. దీంతో టీడీపీకి మాట్లాడే నేతల అవసరం ఎక్కువైంది.

    మండలిలో టీడీపీకి బలం తగ్గిపోయింది. కీలకమైన నేతలు బుద్దా వెంకన్న, బీటెక్ రవి, వైవీబీ రాజేంద్రప్రసాద్ వంటి వారు పదవీ విరమణ చేశారు. దీంతో మండలిలో టీడీపీ తరఫున వాయిస్ వినిపించే వారు కరువయ్యారు. బయట ఎంత వాయిస్ ఉన్నా శాసన సభ, మండలిలో తమ వాణిని వినిపించే నేతలు కనిపించడం లేదు.

    ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే నేతలు కానరావడం లేదు. దీంతో అధినేత చంద్రబాబు నేతల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఫైర్ బ్రాండ్ల అవసరాన్ని గుర్తిస్తున్నారు. శాసనసభలో టీడీపీకి 23 మంది సభ్యులే ఉన్నారు. వీరిలో కొందరు పార్టీ మారడంతో ఇప్పుడు వాయిస్ వినిపించే వారే లేకుండా పోయారు. దీంత తెలుగుదేశం ప్రభుత్వ కార్యక్రమాలను విమర్శించే వారి కోసం అన్వేషణ చేస్తోంది.