
ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి రాజధానుల అంశంపై మాట్లాడారు. విశాఖపట్నానికి రాజధాని రావడం ఖాయమని ఆయన మరోసారి స్పష్టం చేశారు. రాజధాని రావడం ఖాయమని తాము పదేపదే చెబుతున్నామన్నారు. అయితే విశాఖకు రాజధాని త్వరలోనే వస్తుందని, తేదీ ఎప్పుడు అనేది తామే చెబుతామన్నారు. వాల్యు బేసిడ్ టాక్స్ విధానం అనేది దేశవ్యాప్తంగా తీసుకున్న నిర్ణయమని, దాన్ని మనం కూడా అమలు చేస్తున్నామని తెలిపారు.