
కోలీవుడ్ సీనియర్ హీరో, డీఎండీకే పార్టీ అధినేత కెప్టెన్ విజయ్ కాంత్ కొద్దిరోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా ఆయన ఆరోగ్యం బాగుండడం లేదు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఆయనకు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. దీంతో ఇప్పుడు అత్యవసరంగా దుబాయ్ తీసుకెళ్లారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, సన్నిహితులు ప్రార్ధిస్తున్నారు.