విజయ్ కాంత్ కు అస్వస్థత, ఆసుపత్రిలో చేరిక
ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయ్ కాంత్ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తడంతో బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయనను చేర్పించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు డీఎండీకే వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. రొటీన్ హెల్త్ చెకప్ కోసం ఆసుపత్రిలో చేరినట్లు వారు చెప్పారు. విజయకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఒకటి రెండు రోజుల చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని […]
Written By:
, Updated On : May 19, 2021 / 10:31 AM IST

ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయ్ కాంత్ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తడంతో బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయనను చేర్పించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు డీఎండీకే వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. రొటీన్ హెల్త్ చెకప్ కోసం ఆసుపత్రిలో చేరినట్లు వారు చెప్పారు. విజయకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఒకటి రెండు రోజుల చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని కూడా డీఎండీకే వర్గాలు తెలిపాయి.