సింగపూర్ లో కరోనా కొత్తరకం ప్రబలుతోందని, ఆ దేశం నుంచి విమాన సర్వీసులు రద్దు చేయాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను ఆ దేశం తీవ్రంగా ఖండించింది. అది సింగపూర్ వైరస్ రకం కాదని, భారత్ లోకనిపించిన వేరియంటేనని వెల్లడించింది. ఈ మేరకు దిల్లీలోని సింగపూర్ హైకమిషన్ ట్విటర్ ద్వారా బదులిచ్చింది. సింగపూర్ లో కొవిడ్ కొత్త స్ట్రెయిన్ ఉందన్న వార్తలో ఎలాంటి నిజం లేదు. ఫిలో జెనెటిక్ పరీక్షల ద్వారా అది బి. 1.617.2 వేరియంట్ అని తేలింది. గత కొన్ని వారాలుగా సింగపూర్ లో నమోదైన చాలా కేసులకు ఈ స్ట్రేయినే కారణం అని ఎంబీసీ ట్వీట్ చేసింది.