https://oktelugu.com/

మీడియాపై ఏపీ ప్రభుత్వ తీరు సరికాదు

మీడియా గొంతు నొక్కడం కొత్తేమీ కాదు. పలుసార్లు పదే పదే జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఏపీలో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు అప్రజాస్వామికమని మీడియా చెబుతున్నా ఎవరు స్పందించడం లేదు. ఫలితంగా ఆంధ్రజ్యోతి ప్రభుత్వంపై పిటిషన్ దాఖలు చేసింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై ప్రభుత్వం రాజద్రోహం కేసు నమోదు చేసింది. ఇది చట్టవిరుద్ధమని గతంలో సుప్రీంకోర్టు ఏప్రిల్ 30న తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు సైతం.. కరోనా విషయంలో పౌరులు […]

Written By:
  • NARESH
  • , Updated On : May 19, 2021 / 10:34 AM IST
    Follow us on

    మీడియా గొంతు నొక్కడం కొత్తేమీ కాదు. పలుసార్లు పదే పదే జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఏపీలో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు అప్రజాస్వామికమని మీడియా చెబుతున్నా ఎవరు స్పందించడం లేదు. ఫలితంగా ఆంధ్రజ్యోతి ప్రభుత్వంపై పిటిషన్ దాఖలు చేసింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై ప్రభుత్వం రాజద్రోహం కేసు నమోదు చేసింది. ఇది చట్టవిరుద్ధమని గతంలో సుప్రీంకోర్టు ఏప్రిల్ 30న తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు.

    సుప్రీంకోర్టు సైతం..
    కరోనా విషయంలో పౌరులు తమ ఆవేదనను సోషల్ మీడియాలో పోస్టులు చేయడం తప్పుకాదని సుప్రీం కోర్టు చెప్పినా ఏపీ ప్రభుత్వం మాత్రం పెడచెవిన పెడుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంపీ రఘురామ కృష్ణంరాజును అరెస్టు చేయించడం వెనుక పెద్ద డ్రామా నడిచిందని తెలుస్తోంది. రఘురామ అభిప్రాయాలను ప్రసారం చేయడం నేరమా అని ఆంధ్రజ్యోతి స్పందించింది.

    ప్రజాగొంతుక వినిపించకుండా..
    ప్రజల గొంతుక వినిపించే మీడియాపై ఆంక్షలు విధించడం కొత్తేమీ కాదు. మీడియా ప్రసారాలను చట్టబద్ధంగా చూపించినా ఏపీ సర్కారు ఉద్దేశపూర్వకంగా కేసు నమోదు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఆంధ్రజ్యోతి పిటిషన్లో చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతంసవాంగ్ తోపాటు సీఐడీ ఏపీజీ సునీల్ కుమార్ లను ప్రతివాదులుగా పేర్కొంది.

    ఏపీలో విచిత్ర పరిస్థితులు
    ఏపీలో మీడియాపై జరుగుతున్న తతంగాలపై విచిత్ర పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై ప్రభుత్వం అక్కసుతోనే కేసు నమోదు చేసిందని తెలుస్తోంది. దీంతో సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం చేసింది ముమ్మాటికీ తప్పేనని స్పస్టం అవుతోంది. ఆంధ్రజ్యోతి వ్యవహారంలో ప్రభుత్వం చేస్తున్న చర్యలకు ప్రజల నుంచి మద్దు వస్తోంది. అయినా ప్రభుత్వంలో చలనం లేదు.