pawan kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన చాలా సినిమాలు అతనికి మంచి ఇమేజ్ ను తీసుకొచ్చి పెట్టాయి. కెరియర్ స్టార్టింగ్ లో చేసిన వరుస సినిమాలతో సూపర్ సక్సెస్ ను సాధించిన ఆయన చాలా తక్కువ సమయంలోనే పవర్ స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చినప్పటికి తనకంటూ ఒక మార్క్ ను క్రియేట్ చేసుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఆయన జనసేన పార్టీ తరుపున ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం గా కూడా పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే తన నుంచి రాబోయే సినిమాల విషయంలో కూడా ఆయన చాలా కేర్ ఫుల్ గా వ్యవహరించాల్సిన అవసరమైతే ఉంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ మంచి సినిమాలను చేస్తే అది ప్రేక్షకులకు మంచి మెసేజ్ ను ఇచ్చినట్టు అవుతుంది. లేకపోతే మాత్రం ఆయన ఇమేజ్ సైతం డ్యామేజ్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన సూపర్ హిట్ సినిమాల్లో ‘తొలిప్రేమ’ సినిమా ఒకటి…
ప్రస్తుతం ఆ సినిమాని ఇప్పుడు రీమేక్ చేయాలని మెగా హీరో అనుకుంటున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. నిజానికి ఈ సినిమాని పవన్ కళ్యాణ్ కొడుకు అయిన అకిరా నందన్ తో చేద్దామని కొంతమంది నిర్మాతలు సైతం సన్నాహాలు చేస్తున్నారు.
ఇక ఇలాంటి క్రమంలోనే వైష్ణవ్ తేజ ఈ మూవీని రీమేక్ చేయాలని చూడటం ఎంతవరకు కరెక్ట్ అంటూ మరికొంతమంది భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో కొన్నింటిని రీమేక్ చేయకపోతేనే బెటర్ అని మరి కొంతమంది భావిస్తున్నారు. ఎందుకంటే కొన్ని క్లాసికల్ హిట్స్ గా మిగిలిపోతూ ఉంటాయి.
కాబట్టి వాటిని ముట్టుకోకపోవడమే కరెక్ట్ అని ఎందుకంటే దానివల్ల ఏదైనా డ్యామేజ్ జరిగితే మొదటికే మోసం వస్తుందని అంత మంచి సినిమాను రీమేక్ పేరు చెప్పి చెడగొట్టారు అంటూ తీవ్రమైన విమర్శలను ఎదురుకోవాల్సి వస్తుందని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. వైష్ణవ్ తేజ్ నిజంగానే ఈ సినిమాను రీమేక్ చేస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
