Vaibhav debut : వరల్డ్ కప్ హీరో అన్నారు.. బీభత్సంగా పరుగులు చేశాడు అన్నారు. మ్యాచ్ విన్నర్ కాబట్టి అవకాశాలు ఇస్తున్నామని చెప్పారు. కానీ అతడు ఏ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడం లేదు. గల్లి స్థాయిలో ఆడుతూ టీమ్ ఇండియా పరువు తీస్తున్నాడు. దీంతో అతడి సేవలు చాలనుకుని మేనేజ్మెంట్ భావించింది. అంతేకాదు మొహమాటం లేకుండా పక్కన పెట్టింది. ఇదీ టీమిండియాలో సంజు శాంసన్ పరిస్థితి.
రకరకాల ఒత్తిళ్లు.. అనేక రకాల విమర్శలు.. ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ ను పునరాలోచనలో పడేశాయి. ఫలితంగా రెండవ టి20 మ్యాచ్ కు సంజుకు విశ్రాంతి లభించింది. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో బుడ్డబెబ్బులి అలియాస్ వైభవ్ సూర్య వంశీ ఎంట్రీ గ్రాండ్ గా జరిగింది. సూర్యవంశీ జట్టులోకి వచ్చిన తర్వాత పరిస్థితి అమాంతం మారిపోయింది. ఎంతలా అది మారిపోయింది అంటే.. గడిచిన మూడు మ్యాచ్లలో తొలి వికెట్ భాగస్వామ్యం కనీసం 10 పరుగులు కూడా రాలేదు. అలాంటిది ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న రెండో మ్యాచ్లో టీమ్ ఇండియా ఈ కథనం రాసే సమయం వరకు తొలి వికెట్ కు 55 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ మ్యాచ్లో కేవలం సూర్య వంశీ 14 పరుగులు మాత్రమే చేసి ఉండవచ్చు. కానీ అతడు ఇచ్చిన సపోర్ట్ టీమిడియాకు ఎంతగానో లాభించింది. పది బంతులు ఎదుర్కొన్న అతడు రెండు సిక్సర్లు కొట్టాడు. ఇది అతడికి తొలి అంతర్జాతీయ మ్యాచ్.
సూర్య వంశీకి స్థానం కల్పించాలని ఎప్పటినుంచో డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి. సీనియర్ ప్లేయర్ల నుంచి మొదలు పెడితే మాజీ ప్లేయర్ల వరకు అందరూ సూర్య వంశీ గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. అతడికి అవకాశం ఇవ్వాలని కోరారు. మేనేజ్మెంట్ మీద తీవ్రస్థాయిలో ఒత్తిడి రావడంతో చోటు కల్పించింది. వచ్చిన అవకాశాన్ని అతడు దాదాపుగా సద్వినియోగం చేసుకున్నాడు. సంజు శాంసన్ దారుణంగా విఫలమవుతున్నచోట. అతడు తొలి వికెట్ కు అభిషేక్ శర్మతో కలిసి 56 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. సూర్యవంశీ వయసు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. అయినప్పటికీ ప్రమాదకరమైన ఇంగ్లాండ్ బౌలింగ్ మొత్తాన్ని ఎదుర్కొన్నాడు. ఉన్నంతసేపు ఇంగ్లాండు ఫీల్డర్లకు.. బౌలర్లకు చెమట పట్టించాడు. అందువల్లే అభిషేక్ శర్మ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలిగాడు.
A CRAZIEST SHOT – FIRST SIX IN INTERNATIONAL CRICKET
Vaibhav Sooryavanshi has arrived.pic.twitter.com/GLigi5WG2M
— Johns. (@CricCrazyJohns) July 4, 2026
అభిషేక్ శర్మ ఇప్పటివరకు 22 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఒక శిక్ష సహాయంతో 43 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీ దిశగా దూసుకుపోతున్న అతడు కరణ్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. ఇప్పటికే టీమిండియా 6ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరుగుతోంది. ఇండియా ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి.. బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ నిర్ణయం సరైనదేనని టీమిండియా ఓపెనర్లు నిరూపించారు. బుడ్డ బెబ్బులి అలియాస్ సూర్య వంశీ జాతీయ జట్టులో అడుగుపెట్టి.. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసిన నేపథ్యంలో సోషల్ మీడియా మొత్తం అతడి పేరును కలవరిస్తోంది. సూర్య వంశీ నామస్మరణతో మారు మోగిపోతుంది.
THE HISTORIC MOMENT. ❤️
– Vaibhav Sooryavanshi, the youngest ever to get the Indian cap. pic.twitter.com/OR8Q9cCuwC
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 4, 2026

