
మహారాష్ట్ర ప్రభుత్వం మానసిక రోగులకు ఎలాంటి గుర్తింపు పత్రాలు లేకుండానే బుధవారం నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టనుంది. ఈ రోగులకు గుర్తింపు పత్రాలతో నిమిత్తం లేకుండా వ్యాక్సిన్ ఇచ్చేందుకు సన్నద్ధమయ్యాయని అధికారులు వెల్లడించారు. గత వారం థానే, రత్నగిరి మెంటల్ దవాఖానల్లో ఐడీ ప్రూప్ లతో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కాగా బుధవారం నుంచి ఐడీ ఫ్రూఫ్ లేకుండానే వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపడతామని చెప్పారు.