Homeజాతీయ వార్తలుప్రజలను బెదిరింపులకు గురిచేస్తే ఊరుకోం: ఈటల

ప్రజలను బెదిరింపులకు గురిచేస్తే ఊరుకోం: ఈటల

Etela Rajenderమాజీ మంత్రి ఈటల రాజేందర్ ను ఎదుర్కొనే క్రమంలో భాగంగా అధికార పక్షం అక్రమాలకు తెర తీస్తోంది. ప్రజాప్రతినిధులను బెదిరిస్తూ తమ దారికి తెచ్చుకోవాలని చూస్తోంది. దీంతో ఈటల రాజేందర్ విలేకరుల సమావేశం నిర్వహించి ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. హుజురాబాద్ ప్రాంత నేతలను కొనడమంటే కత్తిమీద సామే. వారు మా వెంట ఉంటారని చెప్పారు. మంత్రులు పరిపాలనలో భాగం కాకుండా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. భయభ్రాంతులకు గురిచేస్తే సహించేది లేదని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో తమ వెంట నడిచిన వారందరూ ఇప్పటికీ తన వెంటే ఉన్నారని ధీమా వ్యక్తంచేశారు. అధికార పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడకుండా సభ్యతగా మసలుకుంటే మంచిదని హితవు పలికారు.

ఇన్నాళ్లు రాని వారు..
అభివృద్ధిలో భాగస్వామ్యం కాకుండా ఇప్పుడు వచ్చి బెదిరింపులకు గురి చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ నేతలు స్థానిక నేతలు తమ దారికి రాకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వేధింపులకు గురిచేయడం ఆశ్చర్యకరం. స్థానిక ప్రజలప్రతినిధులను టార్గెట్ చేస్తూ వారిని తాయిలాలు చూపిస్తూ తమ వైపుకు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

రాజకీయ భ్రమల్లో..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి రాజకీయ భ్రమల్లో విహరిస్తున్నారని దుయ్యబట్టారు. 2023 తర్వాత ఎవరి భవిష్యత్తు ఏమిటో అర్థం అవుతుంది. బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలి. ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసే వారిపై త్వరలో చర్యలు తీసుకుంటామని చెప్పారు ప్రజల హృదయాల్లో ఉన్న తనను ఎవరు వేరు చేయలేరని పేర్కొన్నారు.

ఎన్నికలు జరిగితే..
ఒకవేళ ఎన్నికలు జరిగితే ప్రజలంతా తమ వైపే ఉంటారని ఈటల చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సకలజనులు తమవెంట ఉంటారన్నారు. నాయకులను ప్రలోభ పెట్టి తమ పబ్బం గడుపుకునే రోజులు పోయాయి. డబ్బులిచ్చి జైకొట్టుకోవచ్చు కాని అంతిమంగా విజయం తనదేనని జోస్యం చెప్పారు. ప్రజలను ఎవరు కొనలేరు. వారిని రెచ్చగొట్టి ఓట్లు సాధించుకోవలనుకోవడం అవివేకం.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Oktelugu Epaper
Exit mobile version