
కేంద్ర ప్రభుత్వం తమకు సరిపడా టీకాలు ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఆరోపించారు. టీకాలు సరిపడా ఉంటే ఢిల్లీలో కేవలం మూడు నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తవుతుందని చెప్పారు. ఢిల్లీలో 18 ఏండ్లకు పైబడిన వారు మొత్తం 1.5 కోట్ల మంది ఉన్నారని వారందరికీ వ్యాక్సిన్ లు ఇవ్వాలంటే మూడు కోట్ల డోసులు అవసరమని తెలిపారు. కానీ కేంద్రం నుంచి ఢిల్లీకి వచ్చింది కేవలం 40 లక్షల డోసులు మాత్రమేనని కేజ్రివాల్ చెప్పారు. ఇక నుంచైనా నెలకు 80-85 లక్షల డోసుల చొప్పున తమకు ఇస్తే మూడు నెలల్లో వ్యాక్సినేషన్ మొత్తం పూర్తవుతుందన్నారు.