
పౌరసరఫరాల శాఖ సహా వ్యవసాయశాఖలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు. పండిన ధాన్యం పండినట్లే ఫుడ్ ప్రాసెసింగ్ లో భాగంగా మిల్లింగ్ చేసి ఎక్కడ డిమాండ్ ఉండే అక్కడికి సరఫరా చేయాలన్నారు. ఈ దిశగా అన్ని చర్యలు తీసుకోవానలి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఆయా రంగాల్లో నిపుణలు సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. కొత్తగా ముందుకొచ్చే అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తుల పరిశ్రమలను ప్రోత్సహించాలన్నారు.