గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీ తప్పుకున్నాక చంద్రబాబు ప్రభుత్వాన్ని వైసీపీ, బీజేపీ కలిసి టీడీపీని టార్గెట్ చేసేవి. ఆంధ్రప్రదేశ్ లో 2019 ముందు నాటి పరిస్థితులు కనిపించేలా ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ, టీడీపీతో కలిసి వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని చూస్తున్నాయి. దీంతో బీజేపీ ఇద్దరిని టార్గెట్ చేసే పనిలో పడింది. చివరకు కేంద్రం జోక్యం కోరుతోంది. చంద్రబాబు హయాంలో నాటి పరిస్థితుల్ని జగన్ కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది.
టీడీపీ ప్రభుత్వంతో కొన్నాళ్లు సవ్యంగానే సాగిన బీజేపీ బంధం ప్రత్యేక హోదాపై వైసీపీ పోరుతో తెగిపోయింది. ఆ తరువాత కేంద్రం నుంచి తప్పుకున్న టీడీపీ, ఆ తరువాత ఎన్డీయేకు కూడా గుడ్ బై చెప్పింది. అంతటితో ఆగకుండా ఎన్డీయే సర్కారుపై ధర్మపోరాటానికి దిగింది. దీంతో టీడీపీని కౌంటర్ చేసేందుకు బీజేపీ నేతలు చంద్రబాబు విధానాలతో పాటు అప్పట్టో జరిగిన ఓ కీలక వ్యవహారాన్ని కూడా తెరపైకి తెచ్చారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వం తీవ్రంగా ఇరుకునపడింది. మరోవైపు వైసీపీ కూడా జత కలవడంతో బీజేపీ ఆరోపణలు టీడీపీ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేసింది.
విచిత్రంగా జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అదే సీన్ రిపీట్ అయింది. గత టీడీపీ ప్రభుత్వంలో చేసినంత కాకపోయినా భారీ మొత్తంలోనే ఈ వ్యవహారం సాగింది. దీంతో ఈసారి తొలుత టీడీపీ వైసీపీ సర్కారును టార్గెట్ చేసింది. ఆ తరువాత బీజేపీ కూడా అప్పుడు దాన్ని అందుకుంది. అంతే కాదు గత టీడీపీ సర్కారుతో పాటు ప్రస్తుత వైసీపీ సర్కారును కూడా టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తోంది. దీంతో బీజేపీకి కౌంటర్ ఇవ్వలేక వైసీపీ, టీడీపీ ఇరుకునపడుతున్నాయి. చాలా కాలం తరువాత ఏపీలో అధికార, విపక్షాల్ని ఒకే అస్ర్తంతో టార్గెట్ చేసేందుకు బీజేపీకి కూడా మంచి అవకాశం లభించింది.
వైసీపీ ప్రభుత్వం పర్సనల్ డిపాజిట్ (ఫీడీ) ఖాతాలు తెరిచి రూ.41 వేల కోట్లను ఖర్చు చేసింది. అప్పట్లో ఈ విషయాన్ని పీఏసీ తెరపైకి తెచ్చింది. బీజేపీ చంద్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్ చేయగా ఇప్పుడు కూడా పీఏసీ చైర్మన్ పయ్యావుల ఈ విషయాన్ని తెరపైకి తెచ్చారు. బీజేపీ మాత్రం ఇద్దరిని టార్గెట్ చేయడం మొదలు పెట్టింది.
అప్పటి టీడీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున పీడీ ఖాతాలు తెరిచి నిధుల్ని మళ్లించిన వ్యవహారం కేంద్రం దృష్టికి వెళ్లింది. దీంతో కేంద్రం నుంచి టీడీపీ తప్పుకోవడంతో ఈ మొత్తాన్ని ఉద్దేశపూర్వకంగా మళ్లించడం ద్వారా టీడీపీ సర్కారు అవినీతికి పాల్పడిందని ప్రధానితో సహా కేంద్ర మంత్రులూ ఆరోపించారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో పీడీ ఖాతాల ద్వారా సాగిన మళ్లింపుల విషయంలోనూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు టార్గెట్ చేయడం మొదలు పెట్టారు.