Pakistan diplomacy : అమెరికా ఇరాన్ యుద్ధం ముగిసింది. ఇప్పుడు అందరి నోట ఏం జరుగబోతోంది.. ఎవరికి ప్రయోజనం చేకూరుతుంది.. ఈ ఒప్పందం కుదరటంలో పాకిస్తాన్ కీలక పాత్ర పోషించిందని ప్రచారం చేసుకుంటోంది. మేం పెద్ద శాంతి దూతమని ప్రచారం చేసుకుంటోంది. ఉగ్రవాదాన్ని ఎగదోసే పాకిస్తాన్ అట శాంతి దూతనట..
పాకిస్తాన్ ఆంతరంగిక సమస్యలే ఇప్పుడు బయటకు ఆదేశం పరిస్థితిని కళ్లకు కడుతోంది. పీఓకే లో అల్లర్లు ఏ స్థాయిలో జరుగుతున్నాయంటే 70 ఏళ్లు ఈ ఆక్రమిత కశ్మీర్ లోని కశ్మీరీలు పాకిస్తాన్ ను నమ్మారు. వారిని ఆజాద్ కశ్మీర్ పేరుతో వారికి ప్రధాని, అసెంబ్లీ , జ్యూడీషియరీ ఏర్పాటు చేస్తే పాకిస్తాన్ పై అక్కడి ప్రజల్లో నమ్మకం ఏర్పడింది. కానీ మెల్ల మెల్లగా వారికి జ్ఞానోదయమైంది. పాకిస్తాన్ పీఓకేను వాడుకుంటున్నారని.. పాకిస్తాన్ లోని కశ్మీరీలు గ్రహించారు.
పీఓకేలోని జాక్ అని ఏర్పాటు చేసుకొని తీవ్ర ఆందోళన చేశారు. విద్యుత్ ఉత్పత్తి అయ్యే చోట మాకు విద్యుత్ ధరలు తగ్గించాలని.. గోధుమ, నిత్యావసరాల ధరలు తగ్గించాలని.. మా మీద మీ పెత్తనం ఏంటని.. 12 స్థానాలను పాకిస్తాన్ నామినేట్ చేసి మమ్మల్ని ఆడిస్తున్నారని వాళ్లు ఆందోళన చేశారు.
అమెరికా ఇరాన్ ఒప్పందంతో పాకిస్తాన్ ప్రతిష్ట పెరుగుతుందా? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

