- Telugu News » Ap » Union minister kishan reddy %e0%b0%8f%e0%b0%aa%e0%b1%80%e0%b0%a8%e0%b0%bf %e0%b0%95%e0%b1%87%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%82 %e0%b0%86%e0%b0%a6%e0%b1%81%e0%b0%95%e0%b1%81%e0%b0%82
Union Minister Kishan Reddy: ఏపీని కేంద్రం ఆదుకుంది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన ఏపీని కేంద్రం ఆదుకుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. విజయవాడలో జరిగిన జన ఆశీర్వాద యాత్ర సందర్భంగా ఆయన మాట్లాడారు. కొంతమంది బీజేపీ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. అనేక అంశాలలో ఏపీకి ప్రాధాన్యతనిచ్చి నిధులు ఇచ్చామన్నారు. వ్యక్తులు, కుటుంబాల ఆధారంగా నడిచే పార్టీలను నమ్మెద్దని ఆయన పిలుపు నిచ్చారు. కృష్ణా జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు వచ్చాయన్నారు. […]
Written By:
, Updated On : August 19, 2021 / 04:55 PM IST

రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన ఏపీని కేంద్రం ఆదుకుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. విజయవాడలో జరిగిన జన ఆశీర్వాద యాత్ర సందర్భంగా ఆయన మాట్లాడారు. కొంతమంది బీజేపీ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. అనేక అంశాలలో ఏపీకి ప్రాధాన్యతనిచ్చి నిధులు ఇచ్చామన్నారు. వ్యక్తులు, కుటుంబాల ఆధారంగా నడిచే పార్టీలను నమ్మెద్దని ఆయన పిలుపు నిచ్చారు. కృష్ణా జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు వచ్చాయన్నారు. రెండు రాష్ట్రాలు నష్టపోకుండా కేంద్రం బాధ్యత తీసుకుందని పేర్కొన్నారు.