https://oktelugu.com/

Manchu Vishnu: ఆ దర్శకుల వల్లే నా కెరీర్ ఇలా నాశనమైందన్న మంచు విష్ణు

డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు వారుసులుగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు కుమారులు హిట్స్ కోసం.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కోసం చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఒక హిట్.. మూడు ఫ్లాపులుగా వారి సంసారం సాగుతోంది. సరైన బ్రేక్, ఫ్యాన్స్ ఫాలోయింగ్ మాత్రం పెరగడం లేదు. మంచు మోహన్ బాబు వారసులుగా విష్ణు , మనోజ్ వచ్చారు. ఇప్పటికీ వీరిద్దరూ స్టార్ హీరోలుగా ఎదగలేకపోతున్నారు. 20ఏళ్లుగా వీరిద్దరూ సినిమాల్లో ఉన్నా సరైన బ్రేక్ తెచ్చుకోవడం లేదు.ఒకటి […]

Written By:
  • NARESH
  • , Updated On : August 19, 2021 / 04:57 PM IST
    Follow us on

    డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు వారుసులుగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు కుమారులు హిట్స్ కోసం.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కోసం చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఒక హిట్.. మూడు ఫ్లాపులుగా వారి సంసారం సాగుతోంది. సరైన బ్రేక్, ఫ్యాన్స్ ఫాలోయింగ్ మాత్రం పెరగడం లేదు.

    మంచు మోహన్ బాబు వారసులుగా విష్ణు , మనోజ్ వచ్చారు. ఇప్పటికీ వీరిద్దరూ స్టార్ హీరోలుగా ఎదగలేకపోతున్నారు. 20ఏళ్లుగా వీరిద్దరూ సినిమాల్లో ఉన్నా సరైన బ్రేక్ తెచ్చుకోవడం లేదు.ఒకటి రెండూ సినిమాలు బాగా ఆడి ఆ తర్వాత ఆడకపోవడంతో గుర్తింపు దక్కడం లేదు.

    మంచు విష్ణు వరుస సినిమాలు చేస్తున్నా అసలైన హిట్ మాత్రం రావడం లేదు. మొన్నటి 50 కోట్ల ‘మోసగాళ్లు’ మూవీ కూడా విష్ణు ఆశలను అడియాసలు చేసింది. తాజాగా అలీతో సరదాగా అనే ప్రోగ్రాంలో పాల్గొన్న మంచు విష్ణు హాట్ కామెంట్స్ చేశాడు.

    తన కెరీర్ ఇలా కావడానికి కొందరు దర్శకులే కారణం అని.. తాను చేసిన కొన్ని తప్పులు, దర్శకులను గుడ్డిగా నమ్మడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా తన కెరీర్ లో ఆ 4 సినిమాలు చేయకపోయింటే ఈ రోజు తన రేంజ్ మరోలా ఉండేదని మంచు విష్ణు తెలిపాడు. కేవలం ఆ దర్శకుల కారణంగానే తను ఫెయిల్యూర్ చూసానని మంచు విష్ణు వాపోయాడు.

    అయితే కథ పూర్తిగా విన్నాకే మంచు విష్ణు సినిమా చేస్తాడని.. ఆ ఫ్లాప్ ను దర్శకుడు మీద ఎలా వేస్తావ్ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సినిమా హిట్ అయితే క్రెడిట్ తనది.. ఫ్లాప్ అయితే దర్శకులదా? అని పలువురు నెటిజన్లు ఈ కామెంట్లపై మండిపడుతున్నారు.