
కేంద్ర విదేశాంగ మంత్రి ఎన్. జైంశంకర్ ఐదు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం అమెరికా బయల్దేరి వెళ్లనున్నారు. అమెరికన్ కంపెనీల నుంచి కొవిడ్ వ్యాక్సిన్ ల సేకరణ, అదేవిధంగా కలిసి ఉత్పత్తి చేసే విషయమై చర్చించేందుకు జై శంకర్ అమెరికా బయల్దేరి వెళ్తున్నారు. మే 24 నుంచి 28 వరకు జరిగే పర్యటన సందర్భంగా ఎన్ జైశంకర్ అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ తో చర్చలు జరపనున్నట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది.