ప్రతి క్రియేటివ్ పర్సన్ కి కొంతైనా పైత్యం ఉంటుంది. ఇక సినిమా వాళ్లకు అయితే ఆ పైత్యం పాలు ఎక్కువ, సహజంగా వాళ్లు పెరిగే వాతావరణం కూడా వారి మనస్తత్వాల పై ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది. ఆ ప్రభావం వల్లే కావొచ్చు, రోజురోజుకు శృతి హాసన్ పైత్యానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. ప్రతి మనిషి తానూ చదువుకున్న చదువును బట్టి, తోటివారి స్నేహాలను బట్టి, ఆ మనిషి పై ఇతరత్రా అనేక ప్రభావాలు ఉంటాయి, సహజమే.
కానీ, శృతి హాసన్ వ్యవహారం మరోలా ఉంది. విశ్వ నటుడు కమల్ హాసన్ కుమార్తెగా ఆమెకు కష్టపడకుండానే స్టార్ డమ్ వచ్చింది. ఐతే, హీరోగారి కూతురిగా కాకుండా, తాను ఓ ప్రముఖ హీరోయిన్ గా ఉండాలని గ్లామర్ ప్రపంచంలో హద్దులు దాటింది. సక్సెస్ కూడా అయింది. అయితే, స్టార్ హీరోయిన్ అయిన దగ్గర నుండి శ్రుతీహాసన్ లో చాల మార్పులు వచ్చాయి.
వాటిల్లో ముఖ్యంగా తన మనోగతాన్ని నిర్భయంగా బయట పెట్టుకోవడంలో కావొచ్చు, ఆమె లైఫ్ స్టైల్ లో కావొచ్చు రోజులు గడిచేకొద్దీ శృతిహాసన్ మితిమీరుతోంది అంటున్నారు నెటిజన్లు. నిజమే, ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతాను అంటూ గత లాక్ డౌన్ నుండి ఏ సమయంలో కాస్త తీరిక దొరికినా వికారపు ముఖకవళికలు పెడుతూ ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంది శృతి,
పైగా ఆ ఫోటోలలో అమ్మడు గెటప్స్ కూడా మరీ దారుణంగా ఉంటున్నాయి. ఆ ఫోటోలను భరించలేక సోషల్ మీడియా వేదిక కూడా తనలో తానే చిరాకు పడేలా శృతిహాసన్ ప్రవర్తిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అయినా ఇలాంటి కామెంట్స్ కి శృతిహాసన్ రియాక్ట్ అవ్వడం ఎప్పుడో మానేసింది.