కరోనాతో అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ చనిపోయాడని పలు మీడియా సంస్థల్లో సామాజిక మాధ్యమాల్లో శుక్రవారం మధ్యాహ్నం ప్రసారమైన వార్తలను ఢిల్లీ పోలీసులు ఎయిమ్స్ వైద్యులు ఖండించారు. చోటా రాజన్ బతికే ఉన్నాడని చనిపోలేదని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ధ్రువీకరించారు. ఎయిమ్స్ లో ఆయనకు చికిత్స కొనసాగుతుందని తెలిపారు. ఒకప్పటి అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ కు ఏప్రిల్ 26 తేదీన వైరస్ సోకిన విషయం విదితమే అయితే రాజన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారండంతో ఆయనను జైలు నుంచి ఢిల్లీ ఎయిమ్స్ కు ఏప్రిల్ 27న తరలించారు.