ప్చ్.. వెండితెర కంటే బుల్లితెరకే డిమాండ్ !

బుల్లితెర‌ అంటే సినిమా వాళ్లకు ఎప్పుడూ చిన్న చూపే. కానీ, ఇప్పుడు ఆ బుల్లితెరే సినిమా వాళ్లకు ఓ వరంలా మారింది. కరోనా ప్రళయంలో సినిమా అవ‌కాశాలు లేక నలిగిపోతోన్న వాళ్ల‌కూ బుల్లితెర గొప్ప అవకాశాన్ని ఇస్తోంది. ప్రస్తుతం సినిమాల్లో నటించే జూనియర్ ఆర్టిస్ట్ లు అంతా ఇప్పుడు బుల్లితెర వైపు చూస్తున్నారు. వాళ్ళల్లో చాలామందికి అవకాశాలు వస్తున్నాయి. అయితే విచిత్రంగా ఒకప్పుడు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన నటీనటులు, వెండితెర పై తమ వెలుగులు మ‌స‌కబార్చుకున్న […]

Written By: admin, Updated On : May 7, 2021 7:19 pm
Follow us on

బుల్లితెర‌ అంటే సినిమా వాళ్లకు ఎప్పుడూ చిన్న చూపే. కానీ, ఇప్పుడు ఆ బుల్లితెరే సినిమా వాళ్లకు ఓ వరంలా మారింది. కరోనా ప్రళయంలో సినిమా అవ‌కాశాలు లేక నలిగిపోతోన్న వాళ్ల‌కూ బుల్లితెర గొప్ప అవకాశాన్ని ఇస్తోంది. ప్రస్తుతం సినిమాల్లో నటించే జూనియర్ ఆర్టిస్ట్ లు అంతా ఇప్పుడు బుల్లితెర వైపు చూస్తున్నారు. వాళ్ళల్లో చాలామందికి అవకాశాలు వస్తున్నాయి.

అయితే విచిత్రంగా ఒకప్పుడు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన నటీనటులు, వెండితెర పై తమ వెలుగులు మ‌స‌కబార్చుకున్న తరువాత, వారు కూడా మ‌ళ్లీ బుల్లితెర పై తమ వెలుగులను వెలిగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలా సీనియర్లతో పాటు ఉత్సాహ‌వంత‌మైన కొత్త రక్తానికి కూడా అవ‌కాశాల‌ను ఇచ్చి ఆడుకుంటుంది బుల్లితెర. ప్ర‌త్యేకించి గ‌త ఐదారేళ్ల‌లో తెలుగు బుల్లితెర పరిధి విప‌రీతంగా పెరిగిపోయింది.

టీవీ ఛానల్స్ కూడా ఎక్కువైపోవడం, అలాగే సీరియల్స్ తో పాటు అనేక ప్రోగ్రామ్స్ కూడా వస్తుండటంతో ఎంతో మంది న‌టీన‌టులు అవసరం అవుతున్నారు. పైగా ఒక్కసారి బుల్లితెర వైపు వచ్చిన వారు, మళ్ళీ వెండితెర వైపు చూడటం లేదు. ఉపాధితో పాటు మంచి గుర్తింపును కూడా ఇచ్చి ఆద‌రిస్తూ ఉంది బుల్లితెర‌. అందుకే బుల్లితెర ఇప్పుడు అవకాశాలు లేక అల్లాడిపోతున్న వాళ్లకు వెలుగుల తెరగా మారింది.

అన్నిటికి మించి దూర‌దర్శ‌న్ నాటి నుంచి నేటి అనేక టీవీ ఛానెల్స్ వరకూ బుల్లి తెరను నమ్ముకున్న వాళ్ళు ఆర్ధికంగా కూడా మంచి స్థాయిలో ఉన్నారు. ఒక విధంగా సినిమాల్లో మంచి నటులు అనిపించుకున్న వాళ్ళ కంటే కూడా, బుల్లితెర పై స్టార్స్ అనిపించుకున్న వాళ్లే ఎక్కువ సంపాదించడం విశేషం. సినిమా నటీనటులకు సహజంగానే రోజూ షూటింగ్ ఉండదు. అదే బుల్లితెర అయితే నెలకు ముప్పై రోజులు పని దొరుకుతుంది. అందుకే ఇప్పుడు వెండితెర కంటే బుల్లితెరకే ఎక్కువ డిమాండ్.