Ugadi Horoscope: ఉగాది పర్వదినం సందర్భంగా తమ జాతక చక్రం ఎలా ఉంటుందోనని ప్రతి ఒక్కరికి ఆసక్తిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో 2024 ఏప్రిల్ 9 మంగళవారం రోజున ద్వాదశ రాశులపై అశ్వనీ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా 5 రాశాలు వారికి లక్ష్మీ కటాక్షం ఏర్పడనుంది. మరికొన్ని రాశుల వారికి దుర్గామాత అనుగ్రహం ఉంటుంది. ఈ నేపథ్యంలో మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఉగాది పండుగ సందర్భంగా ఈ రాశి వారికి కలిసి వస్తుంది. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులు లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు.
వృషభ రాశి:
ఉగాది పండుగ వృషభ రాశివారికి కలిసి రానుంది. ఉద్యోగులు కార్యాలయాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారులు అనుకున్న వాటికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. కొత్త ఆస్తిని కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు మొదలు పెడుతారు.
మిథునం:
ఈ రాశివారికి ఉగాది కాస్త వ్యతిరేకంగా ఉండనుంది. కొన్ని విషయాలపట్ల ఎక్కువగా వాదనలు చేయకూడదు. తెలియని వ్యక్తులతో స్నేహం చేయొద్దు. అయితే మానసిక ప్రశాంతత లభిస్తుంది.
కర్కాటకం:
కర్కాటక రాశి వారికి ఉగాది మద్దతు ఇవ్వనుంది. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాల ద్వారా కొత్త విషయాలు తెలుసుకుంటారు.
సింహ:
ఈ రాశివారికి ఈరోజు సాధారణ జీవితం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో కొత్త పనులు చేపడుతారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు.
కన్య:
ఈ రాశి వారికి ఉగాది పండుగ అనుకూలంగా ఉంటుంది. ఎదైనా నిర్ణయం తీసుకుంటే అది సక్సెస్ అవుతుంది. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. లక్ష్యానికి అనుగుణంగా ముందుకు సాగుతారు.
తుల:
తులా రాశివారికి ఈరోజు మంచి ఫలితాలు ఉండనున్నాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఏదైనా సాయం కోరితే వెంటనే పొందుతారు. కుటుంబంలో ఉన్న గొడవలు నేటితో పరిష్కారం అవుతాయి.
వృశ్చికం:
ఈ రాశివారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో చేసే పనులు సక్సెస్ అవుతాయి. లక్ష్యం నెరవేరకపోవడం వల్ల నిరాశతో ఉంటారు. కెరీర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.
ధనస్సు:
ధనస్సు రాశి వారికి ఈరోజు వ్యతిరేక పవనాలు ఉండనున్నాయి. డబ్బు వ్యవహారంలో తొందరపడొద్దు. ప్రియమైన వారితో సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
మకర:
ఈ రాశివారికి లక్ష్మీ కటాక్షం ఏర్పడనుంది. ఏదంటే అది సక్సెస్ అయి డబ్బు వచ్చి చేరుతుంది. వినోద కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొని ఆనందంగా ఉంటారు. కుటుంబ సభ్యుల విషయాల్లో జోక్యం చేసుకుంటారు.
కుంభం:
ఈ రాశి వారికి ఈరోజు ఆస్తి విలువ పెరుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పటికే చేపట్టిన కొన్ని పనులు సక్సెస్ అవుతాయి. వ్యాపారులకు సీనియర్ల నుంచి సలహాలు అవసరం.
మీనం:
ఉగాది పండుగ సందర్భంగా మీన రాశి వారికి ఆకస్మిక అదృష్టం వరించనుంది. ఏ పని చేసిన విజయవంతం అవుతుంది. వినోద కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం వల్ల ఉల్లాసంగా ఉంటారు.