Gold Price Today: ఉగాది పర్వదినాన బంగారం ధరలు భారీ షాక్ ఇచ్చాయి. గత కొన్ని రోజులుగా వరుసగా బంగారం ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 9న ఉగాది పర్వదినాన సైతం పసిడి ధరలు తగ్గేదేలే అన్నట్లుగా రికార్డు ప్రైసెస్ నమోదయ్యాయి. దీంతో అసలు బంగారం ధరలు తగ్గుతాయా? లేదా? అని కొనుగోలు దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెండి ధరలు సైతం రికార్డు స్థాయిలో ధరలు ఉండడంతో బెంబేలెత్తుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం స్పాట్ గోల్డ్ ఔన్స్ కు 2344 డాలర్లు కొనసాగింది. సిల్వర్ స్పాట్ ఔన్స్ కు 28 డాలర్లు నమోదైంది. ఈ నేపథ్యంలో దేశీయంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
బులియన్ మార్కెట్ ప్రకారం.. ఏప్రిల్ 9న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,650గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.71,620 గా ఉంది. ఏప్రిల్ 8న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.65,300తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి సోమవారంతో పోలిస్తే మంగళవారం రూ.300 పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,810 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.71,780 గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.65,660 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.71,630 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.66,610 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,660తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.65,660 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.71,630తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.65,660తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.71,630తో విక్రయిస్తున్నారు.
బంగారం ధరలతో పాటు వెండి ధరలు భారీగానే పెరిగాయి. మంగళవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.84,600గా నమోదైంది. సోమవారం కంటే మంగళవారం వెండి ధరలు రూ.1000 పెరిగింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.84,600గా ఉంది. ముంబైలో రూ.84,600, చెన్నైలో రూ.88,100, బెంగుళూరులో 82,900, హైదరాబాద్ లో రూ.88,100తో విక్రయిస్తున్నారు.