
భారత్ లో కరోనా నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు ఈ నెల 4వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని వైట్ హౌజ్ తెలిపింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపింది. భారత్ నుంచి ప్రయాణాలను పరిమితం చేయనున్నట్లు ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకి పేర్కొన్నారు. అమెరికా ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.