సినిమా షూటింగ్ అంటేనే.. హీరోయిన్లు సిగ్గు, మొహమాటం లాంటి లక్షణాలను పూర్తిగా విడిచిపెట్టాలి. అలా విడిచి పెట్టి సినిమా రంగంలోకి అడుగు పెట్టాకా.. ఇక హీరోహీరోయిన్ల వ్యక్తిగత జీవితం పై వచ్చే రకరకాల ప్రచారాలను కూడా భరించాల్సి వస్తోంది. నిజానికి ఆ పుకార్లలో నిజాలు లేని గ్యాసిప్సే ఎక్కువగా ఉంటాయి. ఒక్కోసారి అవి మనసును బాగా ఇబ్బంది పెడతాయి కూడా. కొన్నిసార్లు హీరోయిన్ల వ్యక్తిగత జీవితం కూడా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది.
అయినా ఆ పుకార్లు మాత్రం ఆగవు. నిజాల కంటే ఊహలే మధురంగా ఉంటాయి కాబట్టి.. వాటికే ఎక్కువ ప్రచారం లభిస్తూ ఉంటుంది. అందుకే తమపై వచ్చే ఇబ్బందికరమైన ఊహాగానాల పై స్పందించకుంటే.. ప్రేక్షుకులు అవే నిజమని నిర్ధారించుకుంటారనే భయంతోనే హీరోయిన్లు వాటిలో వాస్తవం లేదు మహాప్రభో అంటూ మొత్తుకుంటూ ఉంటారు. కానీ విచిత్రంగా సోషల్ మీడియాలో అలాంటి వివాదాస్పద రూమర్లే బాగా వైరల్ అవుతూ ఉంటాయి.
హీరోయిన్ రష్మిక పై కూడా ఇప్పటికే అలాంటి రూమర్లు పుంఖానుపుంఖలుగా వస్తూనే ఉన్నాయి. తన పై జరుగుతున్న అసత్య ప్రచారం పై ఆమె కూడా ఎప్పటికప్పుడు స్పందిస్తూ.. నిజానిజాలను చెప్పడం రష్మికకి కూడా ఆనవాయితీ అయిపోయింది. ఎంతో కాలంగా ఓ టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ తో రష్మిక డేటింగ్ చేస్తోందనే వార్త అప్పడుప్పుడు వినిపిస్తూనే ఉంది. రష్మిక కూడా ఆ వార్త పై సీరియస్ గా రియాక్ట్ అయిన సంఘటనలు కూడా చాల జరిగాయి.
అవన్నీ కేవలం వదంతులే అని కొట్టి పారేసింది రష్మిక. అయినప్పటికీ ఆమె ప్రేమాయణం పై ఇంకా వార్తలు వస్తూనే ఉండటం విశేషం. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉంది ? అనే విషయానికి వస్తే.. రష్మిక గతంలో రక్షిత్ శెట్టిని ప్రేమించింది. అలాగే సినిమాల్లోకి రాకముందు మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండేది. కానీ ఆమె గత రెండేళ్లుగా ఎవరితో ఎలాంటి రిలేషన్ లో లేదు. ఆమె సింగిల్ గానే ఉంది. కాబోయే జీవిత భాగస్వామి పై కూడా ఆమెకు ఇప్పట్లో ఎలాంటి ఆలోచనలు లేవు అట.