
మహారాష్ట్రలో ఫేజ్ -3 వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఫేజ్-1 వ్యాక్సినేషన్ భాగంగా 60 ఏండ్లకు పైబడిన వారికి, 45 ఏండ్ల కుపైబడిన వారి దీర్ఘకాలిక రోగులకు టీకాలు వేయడం మొదలుపెట్టారు. అనంతరం ఫేజ్ -2 లో 45 ఏండ్ల వయసు దాటిన అందరికీ వ్యాక్సినేషన్ మొదలు పెట్టారు. ఇప్పుడు ఫేజ్ -3 లో 18-44 ఏండ్ల మధ్య వయసు వాళ్లందరీకి టీకాలను ప్రారంభించారు.