
హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ సమీపంలో ఉన్న గండిపేట వద్ద జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మరణించారు. మృతి చెందిన వారిని సుచిత్రకు చెందిన కౌశిక్, జో డౌన్ అనే విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. గండిపేట సీబీఐటి రోడ్డులో విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొట్టుకుని ఇద్దరు విద్యార్థులు మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.